TB Patients | అర్వపల్లి : అర్వపల్లి మండల పరిధిలో ప్రస్తుతం క్షయ వ్యాధి మందులు వాడుతున్న బాధితులకు న్యూట్రీషన్లు కిట్లను మంగళవారం డాక్టర్ భూక్య నగేష్ నాయక్ ఆధ్వర్యంలో అర్వపల్లి ఆరోగ్యం కేంద్రం నందు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ నగేష్ నాయక్ మాట్లాడుతూ.. టి.బి వ్యాధిని సకాలంలో గుర్తించి మందులు వాడితే పూర్తిగా నయమయ్యే జబ్బు అని, సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా మందులతో పాటు ఆరు నెలల పౌష్టికాహారం అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీహెచ్వో మాలోతు బిచ్చునాయక్, సూపర్ వైజర్ లలిత, కిరణ్, వీరయ్య, శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.