మునుగోడు, మే 21: ప్రతి ఒక్కరూ దైవచింతల కలిగి ఉండాలి అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మునుగోడు మండలం పులి పల్పుల గ్రామ ప్రసన్నాంజనేయ దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొని బుధవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు దైవ చింతనతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రసన్న ఆంజనేయ దేవాలయ నిర్మాణ కర్త ముంగి ధనంజయ చంద్రకళ, చైర్మన్ ఖమ్మం పాటి మారయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోలుగూరి నరసింహ, మండల కార్యవర్గ సభ్యులు కాగితం వెంకన్న, కొంపల్లి రాములు, సింగం యాదయ్య, వినీల్, పందుల యాదయ్య, చిలువేరు సైదులు, జనగాం శంకరయ్య, జనగాం నరసింహ, కె భూపాల్, పగిడిమర్రి బిక్షపతి, బిక్షపతి, ఆచారి తదితరులు పాల్గొన్నారు.