Poco C85x 5G : చైనా బ్రాండ్ పోకో నుంచి బడ్జెట్ రేంజ్ 5జీ ఫోన్ విడుదలైంది. పోకో సీ85 ఎక్స్ 5జీ పేరుతో కొత్త ఫోన్ను ఇండియాలో లాంఛ్ చేసింది. ఇది గత డిసెంబర్లో రిలీజైన పోకో సీ85కి అప్డేటెడ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. దీని ధర బడ్జెట్లోనే ఉంది. ఈ ఫోన్కు ట్రిపుల్ టీవీ రియిన్లాండ్, ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్ ఉందని కంపెనీ వెల్లడించింది. తక్కువ ధరలో బేసిక్ 5జీ ఫోన్ కావాలి అనుకునేవారికి ఇది మంచి ఛాయిస్. ఈ ఫోన్లోని ప్రధాన ఫీచర్లివి.
6.9 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 810 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 4జీబీ+128జీబీ, ఎక్స్పాండబుల్ అప్టు 2టీబీ డెడికేటెడ్ స్లాట్, 5జీ, 210 గ్రాముల బరువు, 6,300 ఎంఏహెచ్ బ్యాటరీ, యునిసాక్ ఆక్టాకోర్ టీ8300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, 32 ఎంపీ రేర్ కెమెరా, 10 ఎక్స్ డిజిటల్ జూమ్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ 52 రేటెడ్, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఎఫ్ఎం, 2.2 హెర్జ్ ప్రైమరీ క్లాక్ స్పీడ్, 35 అవర్స్ వీడియో ప్లే బ్యాక్, 14+ అవర్స్ గేమింగ్, 20+ అవర్స్ సోషల్ మీడియా, 50+ అవర్స్ వాయిస్ కాల్స్, ఓవర్ హీటింగ్, ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్, 7.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్, 200 పర్సంట్ సూర్ వాల్యూమ్ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.13,389. ఆన్లైన్లో సేల్కు అందుబాటులో ఉంది.