CP Sajjanar | తెలంగాణలో వినాయకుడి శోభాయాత్రలో ఓ వైపు కేసీఆర్ పాటలు మార్మోగుతుంటే, మరోవైపు తెలంగాణతోపాటు ఏపీలో ది ప్యారడైజ్ సాంగ్స్ ఊపు ఊపేస్తున్నాయి. డీజేలకు అనుమతులు లేవని చెప్పినా.. వాటి మోత మాత్రం ఆగడం లేదు. ఓవైపు డీజేలపై ఆంక్షలు విధించిన పోలీసులే ఆ డీజేల్లో వస్తున్న పాటలకు స్టెప్పులేస్తున్నారు.
గణేశ్ శోభాయాత్రలో హైదరాబాద్ పోలీసులు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. తాజాగా మరో వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. ఈ సారి ఏకంగా సీపీ సజ్జనార్ డీజే మోతకు చేయి కలిపారు. నగరంలో గణేశ్ నిమజ్జన ర్యాలీ సందర్భంగా ది ప్యారడైజ్ మూవీ నుంచి ఆయా షేర్ పాట ప్లే చేయగా.. సీపీ సజ్జనార్ పోలీసులు, ఇతర భద్రతా బలగాలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ప్యారడైజ్ ఆయా షేర్ పాటకు స్టెప్పులేసిన సీపీ సజ్జనార్ https://t.co/wUucZrMTN2 pic.twitter.com/SDdZbRqcBT
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2026