లక్నో: అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను తాంత్రికుడి వద్దకు ఒక మహిళ తీసుకెళ్లింది. అయితే ఆ మంత్రగాడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. (tantrik rapes girl) ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నరైని ప్రాంతానికి చెందిన ఒక మహిళకు చెందిన 13 ఏళ్ల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ నేపథ్యంలో మూఢ నమ్మకంతో క్షుద్రపూజలు చేసే తాంత్రికుడైన 55 ఏళ్ల పరశురామ్ యాదవ్ వద్దకు ఆమెను తీసుకెళ్లింది. అయితే వ్యాధి నయం పేరుతో మంత్రగాడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ తన కుమార్తెతో కలిసి బిసాండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కాగా, పోలీసులు వెంటనే స్పందించారు. వైద్య పరీక్షల కోసం ఆ బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిలౌలి గ్రామానికి చెందిన నిందితుడైన తాంత్రికుడు పరశురామ్ యాదవ్‌ను శుక్రవారం సాయంత్రం పావారి గ్రామం సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.