మునుగోడు, ఏప్రిల్ 27: మండలంలో కురిసిన అకాలం వర్షం అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చింది. మునుగోడు మండలం వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వరి పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి వాతావరణం మబ్బులు పడి చల్లగా ఉండడంతో రైతులు తమ వరి పొలాలను కోయడానికి వరి కోత మిషన్ల చుట్టూ తిరుగుతున్నా మిషన్లు దొరకక దొరకక ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
BRS Party | కదిలింది తెలంగాణ.. ‘పోరు’గల్లు బాటలోన! హెల్ప్‌లైన్ నంబర్@9014206465
వక్షోజాలు పట్టుకొనే యత్నం రేప్ ప్రయత్నం కాదు.. కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలు
RRR | పాత టెండర్లతోనే 6 లేన్ల ట్రిపుల్ఆర్! డీపీఆర్‌ను సవరిస్తున్న ఎన్హెచ్ఏఐ