హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ)/వరంగల్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గులాబీ జాతరకు ఊరూవాడా సిద్ధమైంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం అట్టహాసంగా జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ జాతరకు లక్షలాదిగా అన్నివర్గాల ప్ర జలు తరలివస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ రజతోత్సవ జోష్ కనిపిస్తున్నది. కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలతో పల్లెలు, పట్టణాలు గులాబీ వర్ణం పులుముకున్నాయి. కూడళ్లన్నీ గులాబీ వర్ణపు వెలుగుల్లో కాంతులీనుతున్నాయి. రా ష్ట్రంలో ఎక్కడికెళ్లినా గులాబీ జాతరపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంపై యావత్తు తెలంగాణ ప్రజానీకం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది.
బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఆదివా రం ఉదయం ముఖ్యకూడళ్లు, చౌరస్తాల్లో ము స్తాబుచేసిన జెండా గద్దెల వద్ద గులాబీ జెం డాను ఆవిష్కరించనున్నారు. గులాబీ కండువాలు ధరించి వాడవాడలా ర్యాలీలు తీయనున్నారు. అనంతరం గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించిన వాహనాల్లో ఎల్కతుర్తి సభకు బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఎగురవేస్తారు.
కేసీఆర్‌పై గౌరవం, ఇంటిపార్టీపై అభిమానంతో రైతులు, సాధారణ ప్రజలు ఎందరో సభకు ముందుగానే బయలుదేరారు. సూర్యాపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎండ్లబండ్లపై ఎల్కతుర్తికి వెళ్తున్నారు. సిద్దిపేటకు చెందిన యువకులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఎందరో పార్టీ అభిమానులు సై కిల్ యాత్రగా వెళ్లారు. సిరిసిల్ల, గజ్వేల్, బాల్కొండ, నిర్మల్ తదితర నియోజవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఏర్పాటైంది. కేసీఆర్ నాయకత్వంలో అలుపెరుగని ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సాధించింది. పదేండ్ల సుపరిపాలనతో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది. ఆ తర్వాత బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రస్తుతం కీలక సందర్భం వచ్చింది. 14 ఏండ్ల ఉద్యమం, పదేండ్ల సుపరిపాలన, 16 నెలల సమర్థ ప్రతిపక్ష పాత్ర.. అన్నింటి మేళవింపుగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఎల్కతుర్తిలో ఘనంగా జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్రస్థానంలో కీలకమైన ఈ మహాసభకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తికి చేరుకునే అన్ని రోడ్లలోనూ శనివారం రాత్రి నుంచే సందడి మొదలైంది. గత 23 రోజులుగా బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా జరిగాయి.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తా త్కాలిక కంట్రోల్ కమాండ్ సెంటర్లో హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే 9014206465 నంబర్‌కు ఫోన్ చేయాలని పార్టీ బాధ్యులు సూచించారు.
బీఆర్ఎస్ సభ ప్రత్యేకతలు