ప్రభుత్వంపై ఎస్‌డబ్ల్యూఎఫ్ కన్నెర్ర
కాంగ్రెస్ మోసపూరిత హామీలపై ఏకంగా ఆ పార్టీ కార్మిక సంఘాలే మండిపడుతున్నాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేండ్లు గడిచినా ఆర్టీసీలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడంతో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఎస్‌డబ్ల్యూఎఫ్(ఐఎన్టీయూసీ) పోరుబాట పట్టింది.
- 24 నుంచి 26 వరకు నిరాహార దీక్షలకు ఆ సంఘం పిలుపు
- రెండేైండ్లెనా హామీలు అమలు చేయలేదని సర్కార్‌పై ఆగ్రహం
- దీక్షలకు సహకరించాలని అన్ని కార్మిక సంఘాలకు లేఖలు
- సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం
- ఎస్‌డబ్ల్యూఎఫ్(ఐఎన్టీయూఎస్) కార్యదర్శి రాజిరెడ్డి ప్రకటన
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ మోసపూరిత హామీలపై ఏకంగా ఆ పార్టీ కార్మిక సంఘాలే మండిపడుతున్నాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేండ్లు గడిచినా ఆర్టీసీలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడంతో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఎస్‌డబ్ల్యూఎఫ్(ఐఎన్టీయూసీ) పోరుబాట పట్టింది. అధికార పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చింది. సంఘం కార్యదర్శి రాజిరెడ్డి ఈ నెల 23 నుంచి 26 వరకు సామూహిక నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు.
నిరసన దీక్షల్లో పాల్గొనండి..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సామూహిక నిరాహార దీక్షలు చేపట్టినట్టు రాజిరెడ్డి తెలిపారు. అన్ని కార్మిక సంఘాలు, యూనియన్ల నేతల నుంచి మద్దతు కోరారు. ఈ మేరకు ఆదివారం అన్ని కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. దీక్షలకు అన్ని సంఘాల నుంచి కార్మికులు వేలాదిగా తరలిరావాలని కోరారు.
కార్మికుల పక్షానే ఉంటాం..
సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాలు కేవలం కార్మికుల కోసమేనని రాజిరెడ్డి చెప్పారు. కార్మికులకు మేలు చేసే క్రమంలో రాజీపడబోమని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలుకు నోచకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు చెప్పారు. హామలు అమలుచేయకపోతే ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతామని ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

