రాజాపేట, మే 18 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం మాజీ ఎంపీటీసీ పారుపల్లి సుమలతాలక్ష్మారెడ్డి సోదరుడి వివాహా వేడుకలు రాజాపేట చల్మెడి ఫంక్షన్ హాల్లో జరిగాయి. ఈ వివాహ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆమె వెంట రాజాపేట మండల పార్టీ అధ్యక్షులు సట్టు తిరుమలేష్, చింతలపూరి వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి చామకూర గోపాల్ గౌడ్, రామిండ్ల నరేందర్, చెరుకు కనకయ్య, రెడ్డబోయిన రాజు, కర్ల కరుణాకర్ రెడ్డి, బొంగోని ఉప్పలయ్య, చింతల ఉప్పలయ్య, బోనాల వెంకటేష్, ఆకుల శ్రీశైలం తదితరులు ఉన్నారు.