దమ్మపేట రూరల్, మార్చి 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా తెలిసింది.
బుధవారం చికెన్ తిన్న తర్వాత 40 మంది విద్యార్థినులు విరోచనాలు, వాంతుల బారిన పడినట్టు సమాచా రం. 15 మంది విద్యార్థినులకు చికిత్స అందించామని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్ దివాకర్ తెలిపారు. తహసీల్దార్ రామ్ నరేశ్ గు రుకుల పాఠశాలను సందర్శించారు.