మనుషుల ఎముకలను కూడా కాల్చేసే వైట్ ఫాస్ఫరస్‌ను లెబనాన్ పౌరులపై ఇజ్రాయెల్ ప్రయోగించిందని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఇరాన్ కూడా నిషేధిత క్లస్టర్ బాంబులు వాడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో యుద్ధ సమయాల్లో వాడకూడని పది ఆయుధాలపై చర్చ మొదలైంది.
ఉద్దేశం: గాలి లేదా నీటి ద్వారా ప్రాణాంతక రసాయనాలను చల్లి చంపడం.
నిషేధం : మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రయోగిస్తే 13 లక్షల మంది చనిపోయారు. 1979-89లో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో సద్దాం హుస్సేన్ వాడాడు. 1988లో ఇరాక్ దీన్ని వాడగా 5 వేల మంది పౌరులు మరణించారు. 1993లో నిషేధించారు.
ఉద్దేశం : గాలి ద్వారా పౌడర్ లేదా లిక్విడ్‌ను చల్లుతారు. మనుషుల చర్మంపై చేరిన ఇది తొలుత చర్మాన్ని కాల్చి.. ఆ తర్వాత ఎముకలను కూడా దెబ్బతీస్తుంది.
నిసేధం : 1980లో నిషేధించారు. అయితే, తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ ప్రయోగించిందనే ఆరోపణలు వచ్చాయి.
ఉద్దేశం: వందల సంఖ్యలోని చిన్న బాంబులను లక్షిత ప్రాంతంలో ఒక పెద్ద బాంబుగా వేసి దాడి చేయడం.
నిషేధం: 2008లో నిషేధించారు. అయితే, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ప్రయోగించినట్టు వార్తలు వచ్చాయి.
ఉద్దేశం: పెట్రోల్‌తో కలగలిసిన ఈ ప్రాణాంతక జెల్‌ను మనుషులపై చల్లుతారు. చర్మంపై పొక్కులు వచ్చి మంటలు చెలరేగుతాయి.
నిషేధం: రెండో ప్రపంచ యుద్ధం, కొరియన్ వార్, వియత్నాం వార్‌లో అమెరికా వాడింది. 1980లో నిషేధించారు.

ఉద్దేశం: ల్యాండ్‌మైన్ తరహా ఆయుధాలు ఇవి. మనుషులతో పాటు వైద్య సామగ్రిని పేల్చడానికి వాడుతారు.
నిషేధం: పలు యుద్ధాల్లో వీటిని ప్రయోగించారు. 1997లో నిషేధించారు. అయితే, ఇప్పటికీ వినియోగిస్తున్నారు.
ఉద్దేశం: లక్ష్యంపై పడగానే విస్తరించి ప్రమాద తీవ్రతను పెంచే బుల్లెట్స్. గాయపర్చడమే వీటి ప్రధాన లక్ష్యం
నిషేధం: పలు యుద్ధాల్లో వినియోగించారు. 1899లో నిషేధించారు. అయితే, ఇప్పటికీ వినియోగిస్తున్నారు.
ఉద్దేశం : మనుషులను చంపడానికి ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్‌లను వినియోగించడం.
నిషేధం : 1972లో నిషేధించారు.
ఉద్దేశం: కంటిచూపు శాశ్వతంగా పోగొట్టేందుకు వినియోగిస్తారు.
నిషేధం: 1995లో నిషేధించారు.
ఉద్దేశం: కంటికి కనిపించనటువంటి గాజు ముక్కలతో దాడి చేస్తారు.
నిషేధం: 1977లో నిషేధించారు
ఉద్దేశం: బొమ్మలు, ఆహారం, మందులు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో బాంబులు పెట్టి చంపుతారు.
నిషేధం: 1977లో నిషేధించారు.