టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం శ్రీవారి ఆలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈనెల 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.