USA vs NED : టీ20 ప్రపంచకప్‌లో అమెరికా తొలి విజయంతో మురిసింది. ఆరంభ పోరులో భారత జట్టుకు గట్టి పోటీనిచ్చిన అమెరికా రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు చుక్కలు చూపించింది. సాయితేజ ముక్కమల్లి(79), శుభం రంజనే(48 నాటౌట్)ల విధ్వంసానికి హర్మీత్ సింగ్(4-21) స్పిన్ మ్యాజిక్ తోడవ్వగా 93 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. షాండ్లీ వాన్ (3-21) సైతం చెలరేగగా 130 పరుగులకే కుప్పకూలింది. అంతర్జాతీయ క్రికెట్లో డచ్ జట్టుపై యూఎస్ఏకు ఇదే మొదటి విజయం కావడం విశేషం.
నిరుడు స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో సూపర్ 8 చేరిన యూఎస్ఏ పదో సీజన్లో బోణీ కొట్టింది. చిదంబరం స్టేడియంలో ఆల్‌రౌండ్ షోతో నెదర్లాండ్స్‌కు చెక్ పెట్టిన అమెరికా పాయింట్ల ఖాతా తెరిచింది. మొదట సాయితేజ ముక్కమల్లి(79), శుభం రంజనే(48 నాటౌట్) మెరుపులతో కొండంత స్కోర్ కొట్టిన అమెరికా.. అనంతరం హర్మీత్ సింగ్(4-21) స్పిన్ ఉచ్చులో విలవిలలాడింది. ఏ ఒక్కరూ క్రీజులో నిలువకపోవడంతో 130కే ఆలౌటైంది.
Massive victory for Team USA against the Netherlands 👏👏
Credit: ICC/Getty#TeamUSA #T20WorldCup @T20WorldCup @ICC pic.twitter.com/ZAnbpscilH
— USA Cricket (@usacricket) February 13, 2026
భారీ ఛేదనలో నెదర్లాండ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మైఖేల్ లెవిట్(3)ను మొదటి ఓవర్లోనే నోస్తుష్ బౌల్డ్ చేసి షాకిచ్చాడు. అనంతరం మ్యాక్స్ ఓ డౌడ్(13), బాస్ డీ లీడే(23)లు కాసేపు నిలబడినా.. వీరిద్దరిని హర్మీత్ సింగ్(4-21) పెవిలియన్ చేర్చి డచ్ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. కాసేపటికే స్కాట్ ఎడ్వర్డ్స్(20)ను సైతం బౌల్డ్ చేసిన హర్మీత్ డచ్‌ను ఓటమి అంచును నిలపాడు. మొహ్సిన్(2-19) సైతం రెండు వికెట్లతో చెలరేగగా నెదర్లాండ్స్ 130కే ఆలౌటై.. యూఎస్ఏ చేతిలో మొదటిసారి పరాజయం పాలైంది.