Fire Accident : చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలోని బృందావన్ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలడంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. పేలుడు శబ్దం విని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా.. రెండు రియాక్టర్లు పేలినట్టు సమాచారం.
కార్మికులు లోపల చిక్కుకున్నురా? ప్రమాద సమయంలో ఎంతమంది లోపల ఉన్నారు? ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.