తిరుమల : తిరుమల,తిరుపతి దేవస్థానం రూపొందించిన 2023 సంవత్సరం క్యాలెండర్ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. గతఏడాది ముద్రించిన ఈ క్యాలెండర్లకు డిమాండ్ ఎక్కువగా రావడంతో ముఖ్యమైన అన్ని నగరాల్లో విక్రయాలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు చైర్మన్ ఆదేశించారు.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ క్యాలెండర్లు తిరుమల,తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో రెండు రోజుల్లో విక్రయాలకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. తిరుమల లోని చైర్మన్ క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, పీఆర్వో డాక్టర్ రవి, ప్రెస్ ప్రత్యేకాధికారి రామరాజు పాల్గొన్నారు.