మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీని ( Ellampeta Municipality ) బీఆర్ఎస్ ( BRS ) కైవసం చేసుకుంది. మున్సిపల్ పరిధిలోని 24 వార్డులకు గాను
బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 8, బీజేపీ 4 స్థానాలను దక్కించుకుంది. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు విస్తృత ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు అవిరాళంగా కృషి చేశారు.