Gabbar Singh Ramesh | గబ్బర్ సింగ్ రమేశ్‌కు చిరంజీవి సాయం
Gabbar Singh Ramesh | ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గబ్బర్ సింగ్ రమేశ్ కుటుంబానికి ఆర్థిక బాసటగా నిలిచేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చాడు. తక్షణ వైద్య సహాయం కోసం రమేశ్ భార్యకు రూ.౩ లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేశారు.
Gabbar Singh Ramesh | గబ్బర్ సింగ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యాక్టర్ రమేశ్ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. రమేశ్‌కు బెయిన్ స్ట్రోక్ రాగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా రమేశ్ కుటుంబానికి ఆర్థిక బాసటగా నిలిచేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చాడు. తక్షణ వైద్య సహాయం కోసం రమేశ్ భార్యకు రూ.౩ లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ మేరకు రమేశ్ భార్యకు చిరంజీవి చెక్కు అందజేశారు.
అంతేకాదు రమేశ్ చికిత్సను అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వ భీమా పథకం వర్తించేలా సహకరిస్తామని చిరంజీవి హామీ కూడా ఇచ్చారు. చిరంజీవి గతంలో కూడా ఆపదలో ఉన్న పేద కళాకారులకు, సినీ కార్మికులకు ఆర్థిక సాయం అందించాడని తెలిసిందే. మరోసారి గబ్బర్ సింగ్ రమేశ్‌కి నేనున్నానంటూ అండగా నిలబడటంతో మెగాస్టార్ గొప్ప మనసుకు అభిమానులు, మూవీ లవర్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
Megastar @KChiruTweets garu has once again come forward for a fellow artist.
He donated ₹3 lakhs for actor Ramesh’s treatment, is coordinating with doctors at Apollo Hospitals, and promised full support including help through the State Government health insurance scheme.… pic.twitter.com/KdoQSZGOVA— BA Raju’s Team (@baraju_SuperHit) July 26, 2026
Read Also :
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

