కొలంబో: టీ20 వలర్డ్కప్(T20 World Cup)లో సంచలన నమోదు అయ్యింది. కొలంబోలో ఇవాళ జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 23 రన్స్ తేడాతో జింబాంబే విక్టరీ కొట్టింది. జింబాబ్వే క్రికెటర్లు అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 169 రన్స్ చేసింది. జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ అత్యధికంగా 64 రన్స్ స్కోరు చేశాడు. అతని ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు ఉన్నాయి. జింబాబ్వే బ్యాటర్లలో మరుమని 35, ర్యాన్ బర్ల్ 35, సికందర్ రాజా 25 రన్స్ స్కోరు చేశారు. జింబాబ్వే 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 125 రన్స్ చేసి భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. కానీ ఆసీస్ బౌలర్లు రాణించడంతో చివరి అయిదు ఓవర్లలో జింబాబ్వేకు 44 రన్స్ మాత్రమే వచ్చాయి.
జింబాబ్వే విసిరిన టార్గెట్ను అందుకునే క్రమంలో ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. అనూహ్య రీతిలో ఓటమిని ఎదుర్కొన్నది. 19.3 ఓవర్లలో 146 రన్స్ చేసి ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా 65, మ్యాక్స్వెల్ 31 రన్స్ చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ 4, బ్రాడ్ ఇవాన్స్ 3 వికెట్లు తీసుకున్నారు. చేజింగ్లో కేవలం 29 రన్స్కే నాలుగు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.ఆ తర్వాత అయిదో వికెట్కు మ్యాక్స్వెల్, రెన్షా 77 రన్స్ జోడించారు. కానీ ఆసీస్ మేటి బ్యాటర్లు జట్టకు విజయాన్ని అందించలేకపోయారు. 4 ఓవర్లలో 17 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్న ముజరబానీ .. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. టీ20 క్రికెట్లో అతను వంద వికెట్ల తీసుకున్న బౌలర్గా నిలిచాడు.
Zimbabwe rise to the occasion with a brilliant all-round display to upset Australia 🙌
#T20WorldCup 📝: https://t.co/DGcVByz7gH pic.twitter.com/d3NylR8B7b— ICC (@ICC) February 13, 2026