Hung verdict | పలు మున్సిపాలిటీల్లో హంగ్.. అప్పుడే మొదలైన హార్స్ ట్రేడింగ్..!
Hung verdict | తెలంగాణ వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఇటీవల ఎన్నికలు జరుగగా.. ఇవాళ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు వెల్లడి అయిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 30కి పైగా మున్సిపాలిటీల్లో, బీఆర్ఎస్ ఏడు మున్సిపాలిటీల్లో విజయాలు సాధించాయి.
Hung verdict : తెలంగాణ వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఇటీవల ఎన్నికలు జరుగగా.. ఇవాళ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు వెల్లడి అయిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 30కి పైగా మున్సిపాలిటీల్లో, బీఆర్ఎస్ 8 మున్సిపాలిటీల్లో విజయాలు సాధించినట్లు సమాచారం. అయితే పలు చోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య గట్టిపోటీ నడుస్తోంది. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ అందుకోక హంగ్ ఏర్పడింది. దాంతో ఆయా మున్సిపాలిటీల్లో హార్స్ ట్రేడింగ్‌కు తెరలేచింది. మ్యాజిక్ ఫిగర్ కోసం అప్పుడే బేరసారాలు మొదలయ్యాయి. చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో స్వతంత్రులు, ఎక్స్ అఫిషియో సభ్యులు కీలకం కానున్నారు.
23 మున్సిపాలిటీల్లో హంగ్
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 23 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ప్రజలు హంగ్ తీర్పు ఇచ్చిన మున్సిపాలిటీల్లో పరకాల, అలంపూర్, నర్సాపూర్, జిన్నారం, కేసముద్రం, ఇస్నాపూర్, ఆసిఫాబాద్, జమ్మికుంట, జనగామ, కామారెడ్డి, అమరచింత, కోహీర్, దేవరకద్ర, ఆసిఫాబాద్, వేములవాడ, రాయికల్, జహీరాబాద్, మహబూబాబాద్, ఆలియాబాద్, బోధన్, గద్వాల, బెల్లంపల్లి, క్యాతనపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి.
బీఆర్ఎస్ ఖాతాలో 8 మున్సిపాలిటీలు
ఇక ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో 8 మున్సిపాలిటీలు వేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, ఇంద్రేశం, గుమ్మడిదల.. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ, మహబూబాద్ జిల్లాలోని తొర్రూరు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీలు ఉన్నాయి.
కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలు
ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నేరేడు చర్ల, హుజూర్నగర్, హాలియా, కోదాడ, సూర్యాపేట, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, అశ్వారావుపేట, స్టేషన్ ఘన్పూర్, ఆందోలు-జోగిపేట, సదాశివపేట, సంగారెడ్డి, హుజూరాబాద్, దేవరకొండ, కొల్లాపూర్, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్‌ఘన్‌పూర్, మథిర, ఇల్లందు, ములుగు, ఆత్మకూరు, చెన్నూరు, రామాయంపేట, వైరా, కల్లూరు, భద్రాచలం మున్సిపాలిటీల్లో గెలిచింది.
కాగా అనూహ్య రీతిలో వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. ఇక ఇతర పార్టీలు ఏ మున్సిపాలిటీలోనూ అధికారానికి దరిదాపుల్లో లేవు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

