అమరావతి : ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తాపీమేస్త్రీలు మృతి చెందారు. జిల్లాలోని లింగపాలెం మండలం పుప్పాలగూడెం వద్ద ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులు ఖమ్మం జిల్లాకు చెందిన సాయిబాబు, భాస్కర్‌రావు వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.