మనామా (బహ్రెయిన్) : బీడబ్ల్యూఎఫ్ పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత పారా షట్లర్లు పతకాల మోత మోగించేందుకు సిద్ధమయ్యారు. బహ్రెయిన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మన షట్లర్లు.. ఏకంగా 15 పతకాలను ఖాయం చేసుకున్నారు.
ఇందులో చరిత్రాత్మక వీల్‌చైర్ సెలక్షన్లో మిక్స్డ్ డబుల్స్ ద్వయం ప్రేమ్ కుమార్, అల్ఫియా జేమ్స్ పతకం కూడా ఉంది. మెన్స్ డబుల్స్ ఎస్ఎల్3, ఎస్ఎల్4 విభాగంతో పాటు మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్3, ఎస్ఎల్4 క్యాటగిరీలోనూ భారత ఆటగాళ్లు సెమీస్ చేరి పతకాలకు అర్హత సాధించారు.