న్యూఢిల్లీ: రైతులు, విద్యార్థులు కలిసి అన్ని వైపుల నుంచి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేర్కొంది. దీని కోసం రైతులు, విద్యార్థులు, యువతతో కూడిన ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. (CJP meet Rakesh Tikait) సీజేపీ ప్రతినిధి అశుతోష్, ఇతర విద్యార్థి నేతలు కలిసి భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)కు చెందిన రైతు నేత రాకేష్ తికైత్, ఇతర రైతు సభ్యులను మంగళవారం కలిశారు. రైతులు, విద్యార్థులు, యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు అవసరమైన భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించారు. ఈ సందర్భంగా రైతుల నుద్దేశించి అశుతోష్ మాట్లాడారు. ‘మన రైతు సోదరులు, దేశంలోని విద్యార్థులు, యువత కలిసి మోదీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేలా పనిచేస్తారని మేం ఆశిస్తున్నాం’ అని అన్నారు.
కాగా, విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలన్న తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కూడా రైతు నేత రాకేష్ తికైత్‌ను సీజేపీ ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్య తీసుకోకపోతే, రైతు సంఘాలు, యువజన సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సీజేపీ హెచ్చరించింది.
మరోవైపు నీట్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలకు రైతు నేత రాకేష్ తికైత్ మద్దతు తెలిపారు. ఆయన పలుమార్లు ఆ నిరసన స్థలాన్ని సందర్శించారు. విద్యార్థుల ఆందోళన, వారి డిమాండ్లకు అండగా నిలిచారు.
THEY ARE PLANNING SOMETHING BIG !!
CJP spokesperson Ashutosh Ranka and several other CJP members met with Rakesh Tikait and many farmers today.
During the meeting, he said that the country’s farmers, students, and youth would now surround the government from all sides. pic.twitter.com/ZwSx8bTxZX
— Common Sensei (@TheQuietSensei) July 28, 2026