బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు కర్నాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతులిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ. శివకుమార్ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘క్రికెట్ అభిమానుల ప్రయోజనాల దృష్ట్యా ప్రజా భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చిన్నస్వామిలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
జస్టిస్ మైఖెల్ డి కున్హా కమిటీ సిఫారసులను అమలుచేస్తూ టికెటింగ్, జనసమూహా నియంత్రణ, స్టేడియం యాక్సెస్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తాం’ అని తెలిపారు. తాజా పరిణామాలతో ఐపీఎల్-2026 ఆరంభ మ్యాచ్‌తో పాటు క్వాలిఫయర్-2, ఫైనల్‌కు బెంగళూరు ఆతిథ్యమిచ్చే అవకాశముంది. అయితే టీ20 ప్రపంచకప్ ముగిశాక బీసీసీఐ విడుదల చేసే ఐపీఎల్ షెడ్యూల్‌తో దీనిపై స్పష్టత రానుంది.