తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ఏడు కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
TTD news | తిరుమల ఆలయంలో కన్నుల పండువగా ప్రణయ కలహోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల పూలచెండ్లతో కలహించడం ఆకట్టుకున్నది. కాగా, టీటీడీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబులెన్స్‌ను విరాళంగా అందించింది.