UAE vs CAN : టీ20 ప్రపంచకప్‌లో యూఏఈ బోణీ కొట్టింది. ఢిల్లీలో నువ్వానేనా అన్నటు సాగిన ఉత్కంఠ పోరులో కెనడాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట జునైద్ సిద్ధిఖీ(5-35) వికెట్ల వేటతో ప్రత్యర్ధిని దెబ్బ తీయగా.. ఓపెనర్ ఆర్యన్ష్ శర్మ(74 నాటౌట్), సొహైబ్ ఖాన్(51)లు అర్ధ శతకంతో జట్టును గెలిపించారు. ఆఖరి ఓవర్లో సొహైబ్ ఔటైనా.. అర్ఫాన్ సింగిల్ తీయడంతో యూఏఈ డగౌట్లో సంబురాలు మొదలయ్యాయి. వరుసగా రెండో ఓటమితో కెనడా సూపర్-8 అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది.
గ్రూప్ డీలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొద్దిలో ఓటమి తప్పించుకుంది. తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన అరబ్ జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ అతికష్టమ్మీద గట్టెక్కింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జునైద్ సిద్ధిఖీ(5-35) పంజా విసరగా కెనడాను 150కే కట్టడి చేసిన యూఏఈ.. ఛేదనలో మాత్రం తడబడింది. ఒకదశలో నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. మరో వికెట్ పడి ఉంటే ఆ జట్టు ఓటమి ఖాయమయ్యేది. కానీ, ఓపెనర్ ఆర్యన్ష్ శర్మ(74 నాటౌట్), సొహైబ్ ఖాన్(51)లు పట్టుదలతో నిలబడి గెలుపునందించారు.
Sohaib Khan gave the chase the impetus it needed, and opener Aryansh Sharma stepped on the gas when it mattered to get the win over Canada 👊 pic.twitter.com/BFbAffWlmM
— ESPNcricinfo (@ESPNcricinfo) February 13, 2026
కెనడా నిర్దేశించిన 151 పరుగుల ఛేదనలో సహచరులు వెనుదిరిగినా ఓపెనర్ ఆర్యన్ష్ శర్మ(74 నాటౌట్) క్రీజునంటుకుపోయాడు. కానీ, సాద్ బిన్ జఫర్(3-14) చెలరేగంతో 66కే నాలుగు వికెట్లు కోల్పోయింది యూఏఈ. ఆ దశలో మరో వికెట్ పడి ఉంటే మ్యాచ్ చేజారేది. అయితే.. సొహైబ్ ఖాన్(51)తో కలిసి ఆర్యన్ష్ ఇన్నింగ్స్ నిర్మించాడు.
ప్రత్యర్ధి బౌలర్లను విసిగిస్తూ.. బౌండరీలతో స్కోర్‌బోర్డును నడిపించారిద్దరూ. ఐదో వికెట్‌కు ఆఖరి ఓవర్లో సొహైబ్ ఔట్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. మూడు బంతుల్లో ఒక పరుగు అవసరమవ్వగా.. అర్ఫాన్ సింగిల్ తీసి గెలిపించాడు. ఐదు వికెట్ల తేడాతో నెగ్గిన యూఏఈ పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో జట్టు విజయంలో భాగమైన జునైద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.