అమరావతి : సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్న ఇద్దరు స్టార్ల సినిమాలకు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచడానికి అనుమతిచ్చింది. రేపు విడుదలవుతున్నబాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాకు రూ. 20 , ఎల్లుండి మెగాస్టార్ నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాకు రూ. 25 పెంచుకునేందుకు ఏపీ సర్కార్ అనుమతి మంజూరు చేసింది.
గతంలో సినీ హీరోలు, నిర్మాతలు,దర్శకుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కొత్త సినిమాలకు ధరలను పెంచడానికి అనుమతి ఇస్తూ వస్తుంది. దీంట్లో భాగంగా రేపు, ఎల్లుండి విడుదల కానున్న ఈ రెండు చిత్రాలకు సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.