కరాచీ: 2010లో లార్డ్స్ టెస్టు జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్(Spot Fixing)కు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత టెస్టు కెప్టెన్ సల్మాన్ భట్, ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్, ఆసిఫ్‌పై ఐసీసీ అయిదేళ్ల వేటు వేసింది. అయితే ఆ స్పాట్ ఫిక్సింగ్ ఎలా బయటకు వచ్చిందన్న విషయాన్ని పాకిస్థానీ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ తెలిపాడు. ఆ సమయంలో జట్టు సభ్యుడిగా ఉన్న రజాక్.. లండన్‌లో జరిగిన ఘటన గురించి ఓటీవల ఓ పాకిస్థానీ టీవీ షోలో వెల్లడించాడు. లండన్‌లో తనకు ఓ మిత్రుడు తెలుసు అని, అతను మొబైల్ ఫోన్లు రిపేర్ చేస్తాడని, అయితే అతని వద్దకు మజహర్ మజీద్ అనే వ్యక్తి ఫోన్ రిపేర్ కోసం వచ్చాడని, రాత్రి పూట మజహర్ ఫోన్‌కు తెగ్ మెసేజ్‌లు వచ్యాయని, స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడే అంశాల గురించి మజీద్‌తో పాటు ముగ్గురు పాక్ ప్లేయర్లు చర్చించుకున్నట్లు తెలిసిందని రజాక్ చెప్పాడు.
ఫోన్ రిపేర్ చేసే తన మిత్రుడు ఆ మెసేజ్‌లను తనకు చూపించాడని, అయితే ఈ విషయాన్ని తాను అఫ్రిదికి చెప్పానని, ఎందుకంటే జట్టులో అతనే సీనియర్ సభ్యుడిని రజాక్ తెలిపాడు. ఫిక్సింగ్ గురించి తెలుసుకున్న అఫ్రిది.. బౌలర్ ఆమిర్‌ను తన తన రూమ్‌కు పిలిపించాడని, అప్పుడు అతని వయసు 18 ఏళ్లు మాత్రమే అని, తనను రూం బయట నిలబడమన్నాడని, ఆమిర్‌పై ఆఫ్రిది అరుస్తున్నట్లు తనకు తెలిసిపోయిందని, నిజం చెప్పాలంటూ గర్జించాడని, అబద్దాలు చెబుతున్న ఆమిర్ చెంపపై ఆఫ్రిది కొట్టినట్లు రజాక్ చెప్పాడు. ఆ తర్వాత ఏడ్చేసిన ఆమిర్ తన ఫిక్సింగ్ కుట్ర గురించి చెప్పాడన్నాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఈ విషయం తెలియడంతో.. టీం యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకున్నట్లు రజాక్ తెలిపాడు. ముగ్గురికి జరిమానా వేసి, క్రమశిక్షణ చర్య తీసుకోవాలని యాజమాన్యం భావించింది. అయితే ఈ విషయం ఐసీసీకి పొక్కడంతో.. క్రికెట్ మండలి ఆ ముగ్గురిపై నిషేధం విధించింది. యూకే క్రౌన్ కోర్టు జైలు శిక్ష కూడా వేసింది. ఆ శిక్ష తర్వాత భట్, ఆసిఫ్ మళ్లీ పాకిస్థాన్‌కు ఆడలేదు. ఆమిర్ ఒక్కడే తన వయసు దృష్ట్యా 2016 లో మళ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. చివరిసారి 2024 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఆడాడతను.