అర్వపల్లి, జూలై 28 : ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి కోరారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం రైతు వేదికలో వీబీగ్రామ్-జీ (VBGRAM-G)లో జలసిరి కార్యక్రమం అలాగే ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల మార్పిడి అంశాలపై విస్తృతంగా చర్చించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ, శాస్త్రీయ సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని సూచించారు. అలాగే వీబీగ్రామ్-జీ జలసిరి కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపుదలకు అవసరమైన చర్యలను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఝాన్సీ, తాసీల్దార్ శ్రీకాంత్, ఏఓ గణేష్, ఏపీఓ, ఏపీఎం, సాంకేతిక సహాయకులు, ఏఈఓలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఓ/వీఓఏలు, సీసీలు, వివిధ శాఖల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.