Munugode | నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మీసేవ, ఆధార్ నమోదు కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి
Munugode | నల్గొండ జిల్లా మండలంలో మీసేవ ఆధార్ నమోదు కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య మునుగోడు మండల కమిటీ నాయకులు ఆరోపించారు.
మునుగోడు : నల్గొండ జిల్లా మండలంలో మీసేవ( Mee Seva ), ఆధార్ ( Aadhar ) నమోదు కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య మునుగోడు( Munugode) మండల కమిటీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మార్వో నరేష్‌కు ఒక వినతిపత్రం అందజేశారు
. ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి మాట్లాడుతూ మీసేవ, ఆధార్ నమోదు కేంద్రాలలో ఏదేని ఒక పనికి సంబంధించి ప్రభుత్వపరంగా సర్వీస్ రుసుము నిర్ణయించినప్పటికీ మీసేవ ఆధార్ నమోదు కేంద్రాల నిర్వహకులు సర్వీస్ పేరుతో పేదల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు.
కొత్త ఆధార్ నమోదుకు సంబంధించి ప్రభుత్వపరంగా ఎలాంటి రుసుము తీసుకోకూడదని నిబంధన ఉన్నప్పటికీ ఒక్కొక్కరి దగ్గర రెండు వందల రూపాయలు చొప్పున సర్వీస్ చార్జీ వసూలు చేస్తున్నారని అన్నారు. అధికంగా డబ్బులు ఇస్తే తొందరగా పూర్తి చేస్తామని అమాయకమైన ప్రజలను మోసం చేస్తూ,అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొడ్డుపల్లి నరేష్, మండల నాయకులు మహేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

