గద్వాల, ఆగస్టు 16 : జూరాలకు ఎగువ నుంచి స్వల్ప వరద కొనసాగుతున్నది. జూరాలకు ఎగువ నుంచి 23వేల క్యూసెక్కుల వరద వస్తుండగా ఎత్తిపోతల పథకాలు, కాల్వలు, విద్యుదుత్పత్తి ద్వారా 26,160 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 318.29 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.193 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. ప్రస్తుతం జూరాల గేట్లు పూర్తిస్థాయిలో మూసి వేశారు. విద్యుదుత్పత్తికి 21,463 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. జూరాలప్రాజెక్టుకు ఇన్ఫ్లో 23,000క్యూసెక్కులు నమోదు కాగా అవుట్ ఫ్లో 26,160 క్యూసెక్కులుగా నమోదైంది. రాత్రి వరకు వరద పెరిగితే గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యాం అధికారులు తెలిపారు.
అయిజ,ఆగస్టు 16 : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో నిలకడగా కొనసాగుతున్నది. ఆదివారం డ్యాంకు ఇన్ఫ్లో 18,850క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 6,785 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం గరిష్ఠస్థాయి నీటిమట్టం 1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1629.54 అడుగుల నీటిమట్టం ఉంది. గరిష్ట స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 92.350 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
శ్రీశైలానికి నిలిచిన కృష్ణమ్మ