గుండుమాల్, ఆగస్టు 16 : జనం మెచ్చిన నేత ప్రజల మనిషి పట్నం నరేందర్ రెడ్డిని విమర్శిస్తే ప్రజలే వారిని తరిమి కొడతారని బీఆర్ఎస్ మండల నేత వీరారం మాజీ సర్పంచ్ తిరుపతి అన్నారు. ఆదివారం వారు మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నాయకులు చేసిన తప్పులను ఎత్తి చూ పితే అది మింగుడుపడని కాంగ్రెస్ నేతలు తమ నేతలపై పిచ్చి పిచ్చి ఆ రోపణలు చేస్తున్నారన్నారు.
దొంగ ల్లాగా పేద రైతుల భూములను లాక్కుంటుంటే ఎవరూ చూస్తూ కూర్చోరని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా హకీంపేట గ్రామంలో ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట రైతుల భూములను కబ్జా చేసిన కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డి తన తప్పులు కబ్జాలు బయటాపడ్డాయన్న నెపంతో ప్రజలకు మొహం చాటేసి తమ నేతలపై పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నేత కేటీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు వి మర్శిస్తావా అంటూ సదరు నేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి మరిచి పాలన చేతకాక ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి మా నేతల మీద ఆరోపణలు చేస్తే ప్రజలు ఊర్లల్లో ఉరికించి కొడతారని హెచ్చరించారు. నీ కబ్జాలను బయటపెట్టిన నమస్తే తెలంగాణ పత్రికపై నువ్వు వ్యవహరించిన తీరు పశువుల కన్న దారుణంగా ఉందన్నారు. పిచ్చి ముదిరిన కాంగ్రెస్ నేత విచక్షణ కోల్పోయి పత్రికపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని మండిపడ్డారు. ఇప్పటితో నీ అడ్డమైన మాటలు ఆపకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మల్లేశ్ యాదవ్, విజయ్, షహీద్, బాలప్ప, దంతే అంజి, వేపూర్ వెంకటేశ్ ఉన్నారు.