కట్టంగూర్ : విద్యార్థులు క్రమ శిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు ( Best Results ) సాధిం చాలని ఆసరా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ మేడి హరికృష్ణ ( Medi Harikrishna ) అన్నారు. మండలంలోని పామనుగుండ్ల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ఆసరా సంస్థ ద్వారా పరీక్ష సామగ్రి ప్యాడ్లు ( Pads ), పెన్నులు ( Pens ) , పెన్సిళ్లు ( Pencills ) , స్కేల్లను స్థానిక సర్పంచ్ వడ్డె మాధవితో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అమూల్యమైన సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారు నవనీత, వార్డు సభ్యులు కారంపూడి సాయికుమార్, ఇన్చార్జి హెచ్ఎం వి. రాఘవ, ఉపాధ్యాయులు అంజనేయులు, శ్రీనివాస్, అలీమ్, పండరి, విజయ, రాణి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.