న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా పోరాడి విద్యార్థులు విజయం సాధించారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పెద్ద భంగపాటు. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు తమ పోరాటాన్ని ప్రపంచం మొత్తం చూసేలా చేశారు. దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగేలా వారు పోరాడారు. నరేంద్ర మోదీ అర్ధరాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేసేలా వారి పోరాటం సాగింది.
తమ ఆశలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఈ పోరాటాలతో జెన్-జీ బయటపెట్టింది. వారి ఆలోచనలను అర్థం చేసుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలం అయిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. యువతలో పెరిగిన ఈ అసంతృప్తి రాబోయే గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
జనాభా ఎక్కువ కలిగిన ఈ రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత కీలకం. యూపీ, గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది. విద్యార్థులు సాధించిన విజయంతో ఇప్పుడు బీజేపీ మీద సామాన్యులు కూడా అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రస్తుతానికి సీజేపీ రాజకీయ పార్టీగా అవతరించలేదు. ఒకవేళ అభిజీత్ దీప్కే రాజకీయాల్లోకి వస్తే అప్పుడు యువతరం అటువైపు ఆసక్తి చూపించే అవకాశాలున్నాయని లండన్ లోని ఎస్వోఏఎస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ తెలిపారు. యువత ఇంత పెద్ద ఎత్తున తరలిరావడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.