నాంపల్లి క్రిమినల్ కోర్టులు, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ మద్రాస్ రెజి మెంట్ ఆయుధాల చోరీ కేసులో మల్లేష్ ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10రోజుల పోలీస్ కస్టడీలో కీలక సమాచారాన్ని సేకరించి అధికారులు నేరాంగీకార వాంగ్మూ లాన్ని నమోదు చేశారు.
2009లో ఆర్మీ జవా నుగా చేరినప్పటినుంచే ఆయుధాలు, మందు గుండు సామగ్రిపై మల్లేష్ శిక్షణ పొందాడు. మిలటరీ కంటోన్మెంట్లలోని ఆయుధాగారాలు బాధ్యతలు నిర్వహించడంతో ఆయుధాల గురించి పూర్తిగా అవగాహన ఉందని మల్లేష్ వివరించాడు. ఆయుధాల పట్ల అన్ని విషయా లను తెలుసుకుంటూ వాటి వాడకం పట్ల అప్ప టినుంచే అవగాహన పెంచుకున్నాడు. అప్పులు తీర్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలోనే ఆయుధాలు చోరీ చేయాలని నిర్ణ యించుకున్నాడు. చోరీ చేసిన ఆయుధాలను అమ్మి డబ్బు సంపాదించుకోవాలని అనుకు న్నాడు. చోరీ చేసిన ఆయుధాలను సంఘ విద్రో హశక్తులకు అమ్మేందుకు పథకం రచించాడు.
ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునే ప్రయత్నం లోనే ఆయుధాల చోరీకి పాల్పడినట్టు అంగీకరించాడు. 2026 జూలైలో మద్రాస్ రెజిమెం ట్లో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్టు మల్లేష్ నేరాన్ని అంగీకరించాడు. సహచరులు శేషు, వినోద్, ప్రవీణ్ లు మల్లేష్‌కు సహకరించడం తోనే ఆయుధాలను చోరీ చేసినట్టు అధికారులు గుర్తించారు. చోరీ పాల్పడిన నాటికి ముందు వారంరోజుల క్రితమే సీసీ కెమెరాలను నిర్వీర్యం చేసినట్టు ఒప్పుకున్నాడు. సీసీ కెమె రాలపై ఫోమ్చల్లి దృశ్యాలు రికార్డు కాకుండాచేసినట్టు తెలిపాడు. విద్యుత్ దీపాలను సైతం ఆర్పివేసి మల్లేష్ తోపాటు సహచరులు భద్రత జవాన్ల దృష్టిని మళ్లించారు. సుమారు గంటన్నరపాటు చోరీ చేసిన ఆయుధాలను తరలించి నట్టు వెల్లడించాడు.
తొలుత ఆయుధాలను బైక్‌పై ఆ తర్వాత కారులో ఆయుధాలను నాగ రికర్నూల్లోని తన ఇంటికి తరలించినట్టు అంగీకరించాడు. కొల్‌కత్తాకు చెందిన బీర్బల్ షాను ఫోన్ ద్వారా సంప్రదించాడు. బీర్బల్‌షా ద్వారా అవలెయ్ అలియాస్ ఓబీకి ఆయు ధాలు విక్రయించేందుకు డీల్ కుదుర్చుకు న్నాడు. ఏకే-47 (నాలుగు) రూ.5లక్షలకు, పిస్టళ్లు రూ. 3 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అగస్టు29న బీర్బల్ మల్లేష్‌కు ఫోన్ చేసినట్టు కాల్ డేటా ద్వారా అధికారులు ఆరా తీయగా, ఆయుధాల డెలివరీ ఆలస్యం కావడంతో బీర్బలా తనకు ఫోన్ చేసినట్టు మల్లేష్ బదులి చ్చాడు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చేవారితోనూ, రోహింగ్యాలతో సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసుల విచారణలో వెల్ల డైంది.
2007లో అమ్రాబాద్, అచ్చంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇండ్ల దొంగతనాల కేసుల్లో మల్లేష్ నిందితుడిగా ఉన్నట్టు అధికా రులు గుర్తించారు. బీర్బల్, అవల్దేవ్ కోసం ఆరు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తు న్నాయి. వారిని అదుపులోకి తీసుకోవడంతో అక్రమ ఆయుధాల క్రయవిక్రయాలపై మరింత సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తు న్నారు. సహచరులు శేషు, వినోద్, ప్రవీణ్ ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. సేకరించిన కీలక ఆధారాలను, మల్లేష్ నేరాంగీకార పత్రాన్ని కోర్టుకు సమర్పించారు.