ఆదమరిచి అడుగేస్తే వైకుంఠపాళీనే!
సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించాల్సిన ప్రగతి వనం వ్యూ పాయింట్ ప్రమాదకరంగా మారింది. ఏమాత్రం ఏమరుపాటుగా అడుగువేసినా ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి నెలకొంది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రగతి వనంలో చెరువు, చుట్టుపక్కల ప్రకృతి అందాలను...
– ప్రమాదకరంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా ప్రగతి వనంలోని వ్యూ పాయింట్ నిచ్చెన
రుద్రంపూర్, నవంబర్ 16 : సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించాల్సిన ప్రగతి వనం వ్యూ పాయింట్ ప్రమాదకరంగా మారింది. ఏమాత్రం ఏమరుపాటుగా అడుగువేసినా ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి నెలకొంది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రగతి వనంలో చెరువు, చుట్టుపక్కల ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌కు వెళ్లే స్టీల్ రౌండ్ నిచ్చెన ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకుంది. వ్యూ పాయింట్‌పైకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన నిచ్చెనలో ఒక మెట్టు పూర్తిగా ఊడిపోయింది. దీంతో నిచ్చెన ఎక్కే సమయంలో సందర్శకులు అదుపుతప్పి కిందపడే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పార్కుకు వచ్చే సందర్శకులు వ్యూ పాయింట్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఊడిపోయిన మెట్టును గమనించకుండా అడుగువేస్తే తీవ్ర గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదమరిచి అడుగేస్తే వైకుంఠపాళీనే!
నిచ్చెనకు సరైన మరమ్మతులు చేపట్టకపోవడంతో పాటు తగిన రక్షణ చర్యలు లేకపోవడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ కాస్తా ప్రమాదాలకు నిలయంగా మారకముందే అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సింగరేణి సివిల్ అధికారులు తక్షణమే స్పందించి ఊడిపోయిన మెట్టును బిగించడంతో పాటు నిచ్చెన మొత్తాన్ని తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సందర్శకులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆదమరిచి అడుగేస్తే వైకుంఠపాళీనే!
air hostess found dead in forest | ఫ్రెండ్‌తో కలిసి వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఎయిర్ హోస్టెస్
KTR | ఎల్లారెడ్డిపేట రేణుక ఎల్లమ్మ సిద్ధోగ వేడుకల్లో కేటీఆర్.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన స్కూల్‌గర్ల్.. వీడియో
సింగరేణి మండల పాస్టర్స్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

