air hostess found dead in forest | ఫ్రెండ్‌తో కలిసి వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఎయిర్ హోస్టెస్
air hostess found dead in forest | దీపావళి కోసం పుట్టింటికి వచ్చిన ఎయిర్ హోస్టెస్ ఒక స్నేహితుడితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ కత్తిపోటు గాయాలతో ఆమె మరణించింది. కొందరు దుండగులు తమపై దాడి చేసి దోచుకునేందుకు ప్రయత్నించినట్లు ఆమె స్నేహితుడు చెప్పాడు. అయితే అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు అనుమానిస్తున్నారు.
ముంబై: దీపావళి కోసం పుట్టింటికి వచ్చిన ఎయిర్ హోస్టెస్ ఒక స్నేహితుడితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ కత్తిపోటు గాయాలతో ఆమె మరణించింది. కొందరు దుండగులు తమపై దాడి చేసి దోచుకునేందుకు ప్రయత్నించినట్లు ఆమె స్నేహితుడు చెప్పాడు. అయితే అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు అనుమానిస్తున్నారు. (air hostess found dead in forest) మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల వర్షా తుర్కర్ ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్నది. 2024లో సమర్ సయ్యద్ అనే వ్యక్తితో ఆమెకు వివాహమైంది. భర్తతో కలిసి పూణేలో నివసిస్తోంది. ఆ దంపతులకు రెండన్నర ఏళ్ల కుమార్తె ఉన్నది. అయితే ఆమె భర్త ప్రస్తుతం ఇండోర్‌లో ఉంటున్నాడు.
కాగా, దీపావళి పండుగ సందర్భంగా వర్ష తన రెండేళ్లన్నర కుమార్తెతో కలిసి మహారాష్ట్రలోని కిన్హి గ్రామంలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. నవంబర్ 14న సాయంత్రం వేళ కాలేజీ నుంచి పరిచయం ఉన్న స్నేహితుడైన రితేశ్ అగర్వాల్‌తో కలిసి గోండియా జిల్లాలోని వైన్‌గంగా నది సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లింది.
అయితే ఆ రోజు సాయంత్రం 6 గంటల గంటల సమయంలో వర్ష బావ అయిన అశ్విన్‌కు రితేష్ ఫోన్ చేశాడు. ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు తమపై దాడి చేసి దోచుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. వర్షపై కత్తితో దాడి చేసి వారు పారిపోయారని, ఆమె తీవ్రంగా గాయపడినట్లు చెప్పాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే అశ్విన్, వర్ష కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె రక్తపు మడుగులో పడి ఉండటం చూసి వారు షాక్ అయ్యారు. వర్షాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 7 గంటల సమయంలో పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు.
కాగా, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వర్షాపై కత్తితో దాడి జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. వర్ష స్నేహితుడు రితేష్, ఆమె బావ అశ్విన్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో వర్షతో పాటు ఉన్న రితేష్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడం, దోపిడీ కోసం దుండగులు తమపై దాడి చేసినట్లు అతడు చెప్పడంపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
air hostess found dead in forest | ఫ్రెండ్‌తో కలిసి వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఎయిర్ హోస్టెస్
KTR | ఎల్లారెడ్డిపేట రేణుక ఎల్లమ్మ సిద్ధోగ వేడుకల్లో కేటీఆర్.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన స్కూల్‌గర్ల్.. వీడియో
సింగరేణి మండల పాస్టర్స్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
TVS Family | టీవీఎస్ గ్రూప్‌లో ముదిరిన ఆస్తుల వివాదం.. ఆస్తిలో ఈక్వల్ షేర్ కోరుతూ తండ్రికి లక్ష్మీ వేణు నోటీస్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

