Health Tips | కోడిగుడ్డు పచ్చసొన తింటే ఒంట్లో చెడు కొవ్వు పెరుగుతుందా.. ?
Health Tips | కోడిగుడ్డు పచ్చసొన (Egg Yolk) తినాలంటే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే దాంట్లో కొవ్వుల శాతం ఎక్కువగా ఉంటుందని, అది తినడంవల్ల రక్తనాళాల్లో చెడు కొవ్వు పెరుగుతుందని ఆందోళన చెందుతారు. కొవ్వు పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి గుండె జబ్బులు వస్తాయని జంకుతుంటారు.
Health Tips : కోడిగుడ్డు పచ్చసొన (Egg Yolk) తినాలంటే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే దాంట్లో కొవ్వుల శాతం ఎక్కువగా ఉంటుందని, అది తినడంవల్ల రక్తనాళాల్లో చెడు కొవ్వు పెరుగుతుందని ఆందోళన చెందుతారు. కొవ్వు పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి గుండె జబ్బులు వస్తాయని జంకుతుంటారు. ఒంట్లో కొవ్వు పెరిగి స్థూలకాయం వంటి ఇతర అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని మరికొంత మంది కోడిగుడ్డు పచ్చసొనను పక్కన పెడుతుంటారు. కానీ అది ఒట్టి అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి కోడిగుడ్డు పచ్చసొనతో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రయోజనాలు
కోడిగుడ్డు పచ్చసొన అధిక మొత్తంలో కొవ్వులు కలిగి ఉన్నప్పటికీ దాని ద్వారా రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు మాత్రం పెరుగవని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
గుడ్డు పచ్చసొనను తినకపోవడం వల్ల ముఖ్య పోషకాలైన కొలైన్, సెలీనియం, జింక్తోపాటు విటమిన్ ఎ, బి, ఇ, డి, కె కూడా కోల్పోతారు. బి కాంప్లెక్స్, విటమిన్ డి లకు ప్రధాన వనరుగా గుడ్డును పేర్కొంటారు.
కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. దాన్ని మన శరీరం సులువుగా గ్రహిస్తుంది. అదేవిధంగా గుడ్డులో ఉండే ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
అంతేగాక పలు జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు గుడ్డులోని పోషకాలు సహకరిస్తాయి. పచ్చసొనలో కేలరీలు కూడా తక్కువే ఉంటాయి. కాబట్టి తిన్నా బరువు పెరుగుతారన్న బెంగలేదు. నిశ్చింతగా గుడ్డు మొత్తం తినొచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | కోడిగుడ్డు పచ్చసొన తింటే ఒంట్లో చెడు కొవ్వు పెరుగుతుందా.. ?
Foods In Fridge | ఆహారాలను ఫ్రిజ్లో ఉంచి పదే పదే వేడి చేసి తింటున్నారా.. ఎలాంటి వ్యాధులు వస్తాయంటే..?
డైవర్షన్ రోడ్డును పునఃరుద్దరించాలని కంపగూడెం గ్రామస్తుల ధర్నా
Tamil Nadu | తమిళనాడులో ఘోరం.. చేపలు పట్టడానికి వెళ్లి, చెరువులో మునిగి.. ముగ్గురు బాలురు దుర్మరణం..!
ఆదమరిచి అడుగేస్తే వైకుంఠపాళీనే!
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

