Tamil Nadu | తమిళనాడులో ఘోరం.. చేపలు పట్టడానికి వెళ్లి, చెరువులో మునిగి.. ముగ్గురు బాలురు దుర్మరణం..!
Tamil Nadu | చేపలు పట్టడం కోసం వెళ్లి చెరువులో మునిగి ముగ్గురు బాలురు దుర్మరణం పాలయ్యారు. తమిళనాడు (Tamil Nadu) లోని కల్లకురిచి జిల్లా (Kallakurichi district) చిన్నసాలెం (Chinnasalem) సమీపంలోని తొట్టపాడి (Thottapadi) లో ఇవాళ (సోమవారం) ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
Tamil Nadu : చేపలు పట్టడం కోసం వెళ్లి చెరువులో మునిగి ముగ్గురు బాలురు దుర్మరణం పాలయ్యారు. తమిళనాడు (Tamil Nadu) లోని కల్లకురిచి జిల్లా (Kallakurichi district) చిన్నసాలెం (Chinnasalem) సమీపంలోని తొట్టపాడి (Thottapadi) లో ఇవాళ (సోమవారం) ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన ముగ్గురు బాలురులో ఇద్దరు అన్నదమ్ములు కాగా, మరొకరు వారి స్నేహితుడని స్థానికులు తెలిపారు.
ముగ్గురు బాలురు చేపలు పట్టడం కోసమని ఆదివారం మధ్యాహ్నం చెరువు దగ్గరికి వెళ్లారు. పిల్లలకు ఇళ్లకు రాకపోవడంతో తల్లిదండ్రులు అంతా వెతికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం చెరువులో గాలించగా ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. దాంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులను ఇమ్మాన్యుయేల్ (11), సామ్ అబ్రహం (9), రాజా (14)గా గుర్తించారు. ఇమ్మాన్యుయేల్, సామ్ అబ్రహం సోదరులు కాగా, రాజా వారి స్నేహితుడు.
చెరువు నుంచి వెలికితీసిన అనంతరం బాలుర మృతదేహాలను పోస్టుమార్టం కోసం కల్లకురిచి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. చేపలు పట్టే ప్రయత్నంలో బాలురు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో కుట్ర జరిగినట్లు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. అయితే ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamil Nadu | తమిళనాడులో ఘోరం.. చేపలు పట్టడానికి వెళ్లి, చెరువులో మునిగి.. ముగ్గురు బాలురు దుర్మరణం..!
ఆదమరిచి అడుగేస్తే వైకుంఠపాళీనే!
air hostess found dead in forest | ఫ్రెండ్‌తో కలిసి వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఎయిర్ హోస్టెస్
KTR | ఎల్లారెడ్డిపేట రేణుక ఎల్లమ్మ సిద్ధోగ వేడుకల్లో కేటీఆర్.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన స్కూల్‌గర్ల్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

