Sajjanar | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ భవానీనగర్ పోలీస్ స్టేషన్లో కస్టడీ వేధింపులపై తగిన విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసు కోవాలంటూ ఆగస్టు 13న ఇచ్చిన ఆదేశా లను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ మహ్మద్ షానవాజ్ ఆలం హైకో ర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి. మాధవీదేవి విచా రణ చేపట్టారు.
పిటిషనర్ తరపు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ ఎలాంటి క్రిమి నల్ కేసులు లేకపోయినా పిటిషనర్‌ను ఆగస్టు 6న పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారన్నారు. దీనిపై కమిషనర్ తో సహా అధికా రులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. దీనిపై విచారించిన కోర్టు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఒకవేళ ఆరోపణలు వాస్తవమైతే బాధ్యులపై చర్యలు తీసు కోవాలంటూ ఆగస్టు 13న కమిషనర్ ను ఆదేశించినా చర్యలు తీసుకో లేదన్నారు. అందువల్ల కమిషనర్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసు కోవాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతివాది అయిన పోలీసు కమిషనర్ వి.సి.సజ్జనారు నోటీసులు జారీ చేస్తూ విచారణను నవంబరు 6కు వాయిదా వేశారు.