Indiramma Illu | సిటీ బ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): సిటీలో ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరిట దరఖాస్తుదారు లను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తు న్నది. ఒక్కోలబ్ధిదారుడు రూ.6 లక్షలు చెల్లించాలని నిబంధన పెట్టినా.. అప్పు చేసైనా సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం పెట్టిన నిబంధనలు పాటిస్తూ దరఖాస్తు చేసు కుని… లాటరీలో పాల్గొన్నారు. లాటరీలో పేరు రాగానే .. తమకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్లేనని సంబరప డిపోయారు. కానీ.. సగానికి పైగా లబ్ధిదారులు ఆ సంతో షాన్ని లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం పెడుతున్న కొత్త కొత్త షరతులు, ఇష్టానుసారమైన నిబంధనలతో లాట రీలో పేరు వచ్చిన వారికి కూడా ఇంటిని కేటాయించకపో వడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు నుంచి ఇంటి కేటాయింపు దాకా ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులకు అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తామని ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి లాటరీకి ఆహ్వానించారు. పేర్లు వచ్చిన వారిని పైలట్ ప్రాజెక్టు కింద ఒక్కో టవర్‌కు 480 మంది చొప్పున ఎంపిక చేశారు. ప్రతి నియోజకవర్గానికి మరో 120 మందిని ఎంపిక చేసి వెయిటింగ్ లిస్టు కింద ఉంచారు. కానీ వెయిటింగ్ లిస్టు కింద ఎంపిక చేసిన మొత్తం 1920 మందిని మాత్రం రెండో దశలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. అలాంటప్పుడు లాటరీలో తమ పేరు ఎందుకు తీశారు? ఇప్పుడు మళ్లీ ఎందుకు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నా రని నిలదీస్తున్నారు. అదే విధంగా పథకాన్ని ప్రకటించినప్పుడు హైదరబాద్ లో పదేండ్ల నుంచి నివసిస్తున్న వాళ్లు 16 నియోజకవ ర్గాల్లో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. 16 నియోజకవర్గాల వ్యాప్తంగా అలా దరఖాస్తు చేసుకున్నవాళ్లలో వెయ్యి మందికి పైగా లాటరీ ద్వారా ఎంపికయ్యారు. ఇప్పుడు వాళ్లు తాము నివసిస్తున్న నియోజకవర్గంలోనే తిరిగి దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. అలాంటప్పుడు లాటరీ కంటే ముందే వారిని అనర్హులుగా గుర్తించాల్సింది కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ సొంత నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోమనడం ఏంటి? అని నిలదీస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి దరఖాస్తుదారు లను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నది. చిన్నచిన్న కుంటి సాకులను చూపుతూ దరఖాస్తుదారులను అనర్హులుగా తేల్చడం నుంచి మొదలు పెడితే ఇల్లు కేటాయింపు దాకా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. టెక్నికల్ ఎర్రర్, ఎంక్వైరీ పేరిట ఇప్పటికే వందల మంది అర్హులకు ఇండ్లు ఇవ్వకుండా మొండి చేయి చూపింది. ఇక ఒక్కో టవర్‌కు అర్హు లను పూర్తిస్థాయిలో ఎంపిక చేయకుండానే ప్రారంభోత్సవాలు మొదలు చేస్తున్నారు. అటు ప్రభుత్వ తొందరపాటు వల్ల అధికారు లను పూర్తిస్థాయిలో పనిచేయనీయడం లేదు. దరఖాస్తుల పరిశీలన, అర్హుల గుర్తింపుతో పాటు లబ్ధిదారుల ఎంపిక దాకా ఆగమేఘాల మీద చేపట్టారు. దీంతో అసలైన అర్హులకు అన్యాయం జరుగుతున్నది. అధి కారులకు తగినంత సమయం ఇవ్వకపోవడంతో ప్రతి దశలోనూ తప్పి దాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. రెండో దశ లోనైనా ఎలాంటి తప్పిదాలు జరగకుండా అసలైన అర్హులకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.