Medaram Jatara | తాడ్వాయి, అక్టోబర్ 2 : ఆసియాలోనే అతిపెద్ద గిరి జన కుంభమేళాగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కోట్లా ది మంది భక్తుల కొంగు బంగారంగా బాసిల్లే ఈ పవిత్ర క్షేత్రంలో మహాజాత రల నిర్వహణ, ఆలయ పర్యవేక్షణ వ్యవహారాల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా శాశ్వత అధికారులను నియ మించకుండా డిప్యుటేషన్(తాత్కాలిక) అధికారుల తోనే మహాజాతరను నిర్వహిస్తుండడంతో ఆలయ సమగ్ర అభివృద్ధి పెద్ద సమస్యగా మారింది.
రూ.కోట్ల ఆదాయం, ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతరతో పాటు ప్రతి బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో వేలాది మంది భక్తులు తరలివచ్చే ఈ ఆలయానికి పూర్తిస్థాయి కార్యనిర్వాహక అధికారి, శాశ్వత సిబ్బంది లేకపోవడం గమనార్హం. డిప్యుటేషన్‌పై వచ్చే అధికారులు బాధ్యతా రాహిత్యం, సమన్వయ లోపంతో మహాజాతర ముగి యగానే తమ సొంత శాఖలకు తిరిగి వెళ్లిపో తున్నారు. దీంతో ఆలయ నిరంతర అభివృద్ధిపై దృష్టిసారించే నాథుడే కరువయ్యాడు. తాత్కాలికంగా వచ్చే అధికా రులు కేవలం జాతర జరిగే నాలుగు రోజుల ఏర్పాట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప మేడారాన్ని శాశ్వత పర్యా టక, ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్లపై దృష్టి పెట్టలేకపోతున్నారు.
రెండేళ్లకో సారి జరిగే మహాజాతర సందర్భంగా ప్రభత్వాలు వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమవుతు న్నది. అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు రాత్రి వేళ లలో బస చేసేందుకు సత్రాలు, మరుగుదొడ్లు తాగు నీటి వ్యవస్థలు అరకొరగానే మిగిలిపోతున్నాయి. నిధులు మంజూరైనా వాటిని సమర్థవంతంగా వినియో గించి పనులు చేయించే నాథుడు లేక అభివృద్ధి పనులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఇప్పటికైనా మేడారా నికి శాశ్వత అధికారులను నియమించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.