న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీసిన ఒక అద్భుతమైన టైమ్‌లాప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న ఈ అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రివేళ భారత్, శ్రీలంక దేశాల రూపురేఖలు అద్భుతంగా ప్రకాశిస్తూ కనిపించాయి.
నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో ఎర్త్ సైన్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ యూనిట్ అందించిన చిత్రాల ఆధారంగా ఈ ప్రత్యేక దృశ్యాలను రూపొందించారు.