జైనూర్ ఫిబ్రవరి, 13: ఉట్నూర్ నుండి జైనూర్ వరకు లైన్ వర్క్ మరమత్తుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ డి.శ్రీనివాస్ తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ 33/kv రిపేర్ పనులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
శనివారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు సిర్పూర్ యూ, లింగాపూర్, జైనూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాబట్టి గ్రామీణ విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని ఆయన కోరారు.