Rayapole | రాయపోల్ మండల కేంద్రంలోనే తహసీల్దార్ కార్యాలయం నిర్మించాలి
Rayapol | రాయపోల్ మండల కేంద్రంలోనే తహసీల్దార్ కార్యాలయం నిర్మించాలి. ఇందుకు ఉన్నతాధికారులు స్పందించాలి అని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
Rayapole | రాయపోల్: రాయపోల్ మండల కేంద్రంలోనే నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలించడాన్ని గ్రామస్తులు (Villagers) తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం మండల కేంద్రంలోనే చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అనువైన స్థలాలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. సర్వే నంబర్ 720 లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని, అక్కడే నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని పేర్కొన్నారు.
స్థల పరిశీలన విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి, మండల కేంద్రంలోనే తహసీల్దార్ కార్యాలయ (MRO Office) నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు కోరారు. కార్యాలయాన్ని మండల కేంద్రం వెలుపలికి తరలించే ప్రతిపాదనను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యం, మండల కేంద్రం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ హనుమంతు రాజు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

