కోల్‌కతా: దుర్గాపూజ వేళ మాంసాహారం తినరాదు అని బెంగాలీలకు ఇటీవల ఓ హిందూ సాధువు సూచన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. గుడిలో మాంసాహారాన్ని భుజించడం సంప్రదాయమా కాదా అన్న చర్చ జరిగింది. కానీ బెంగాల్లో మాత్రం గుడిలో చేపల్ని తింటారు. ఇక గురువారం కౌశిక్ అమావాస్య సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం సువేంధు అధికారి(Suvendu Adhikari) చేపలు తిన్నారు. కోల్‌కతాలోని కాళీఘాట్‌ను విజిట్ చేసిన ఆయన అక్కడ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన ఫ్రై చేపను భుజించారు. ఫ్రైడ్ ఫిష్‌తో పాటు బసంతి పులావ్ ఆయన ప్లేట్లో ఉన్నట్లు ఫోటోలు, వీడియోలు రిలీజ్ అయ్యాయి.
కాళీమాతకు మేక మాంసం. చేపల్ని నైవేద్యంగా పెట్టడం బెంగాల్లో సంప్రదాయం. ఇక ఆ నైవేద్యాన్ని భక్తితో భక్తులు సేవిస్తారు. అయితే శాఖాహార భోజన పద్ధుతులను బెంగాలీలపై రుద్దుతున్నట్లు బీజేపీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం సువేందు అధికారి తాజా స్టంట్తో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో శాఖాహార, మాంసాహార చర్చ ముగుస్తుందని ఆశిస్తున్నట్లు బీజేపీ పేర్కొన్నది. బెంగాలీ విశ్వాసాలను, సంప్రదాయాలను, జీవన విధానాలను గౌరవిస్తామని, సీఎం సువేందు అధికారి నాయకత్వంలో బెంగాలీలకు అన్ని ప్రయోజనాలు కలిగేలా చేస్తామని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి తెలిపారు.
ఇటీవల భగేశ్వర్ థామ్‌కు చెందిన ధీరేంద్ర శాస్త్రి.. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దుర్గాపూజ వేళ మాంసాహారాన్ని విడిచిపెట్టాలని పేర్కొన్నారు. దుర్గాపూజ వేళ నాన్ వెజ్ తింటున్న బెంగాలీలను పాకండులు అంటూ విమర్శించారు. బెంగాల్‌లోని మాంసం, లిక్కర్ షాపులు దుర్గాపూజ వేళ మూసివేయాలని కూడా భగేశ్వర్ బాబా తన ప్రసంగంలో తెలిపారు. ఆ వ్యాఖ్యలతో బెంగాలీ ప్రజల్లో వెజ్-నాన్‌వెజ్ అంశంపై చర్చ మొదలైంది. కానీ ఆ బాబాను ఓ కార్యక్రమానికి సీఎం ఆహ్వానించారు. బెంగాలీ ఆహార నియమావళి విషయంలో ఎవరూ తమకు హుకుం ఇవ్వలేరని సీఎం అన్నారు. బెంగాలీలు చేపలు, మాంసాన్ని తింటారని, ఈ అంశంలో వివేకానంద కూడా బెంగాలీలకు అనుకూలంగా మాట్లాడారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య తెలిపారు.
భగేశ్వర్ బాబా దిష్టబొమ్మలను దగ్ధం చేసిన వారిని అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారు. తాను సనాతన హిందువును అని, మహాష్టమి నాడు దుర్గామాతను పూజిస్తానని, ఆ రోజు సాత్విక ఆహారాన్ని తీసుకుంటానని, కార్తీక మాసంలో కూడా శాఖాహారం తింటానని, అయితే కాళీమాతకు నైవేద్యం పెట్టిన నాన్‌వెజ్ ఆహారాన్ని కూడా తింటానని, ఇవాళ కాళీ గుడిలో అమ్మవారికి చేప తల, ఫ్రైడ్ ఫిష్, బసంతి పులావ్ పెట్టారని, వాటిని తిన్నట్లు సీఎం తెలిపారు.
Putting all controversy at rest. CM Suvendu Adhikari is currently eating Kalighat Kali Maa’s Fish Bhog. Today is the final Amavasya and it’s a special day for us pic.twitter.com/rLIqwcWg3u
— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) September 10, 2026