The Under 18 World | తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు సంబంధించిన ఓ సరదా సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
‘ది అండర్ 18 వరల్డ్’ (The Under 18 World) అనే యూత్ టాక్ షోలో పాల్గొన్న కేటీఆర్‌కు అక్కడున్న చిన్నారులు ఒక క్రేజీ ఛాలెంజ్ విసిరారు. మీ ఫోన్ నుంచి నేరుగా సూపర్ స్టార్ ప్రభాస్‌కు కాల్ చేయాలని కోరడంతో, కేటీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా తన వ్యక్తిగత ఫోన్ నుంచి డార్లింగ్ ప్రభాస్‌కు డయల్ చేశారు. అవతలి వైపు నుంచి ప్రభాస్ ఫోన్ లిప్ట్ చేసి “గుడ్ ఈవెనింగ్ సార్” అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. వెంటనే ఆ చిన్నారులు ఫోన్‌ను తమ చేతిలోకి తీసుకుని సరదాగా ప్రాంక్ చేయడం ప్రారంభించారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఫోన్ దొరికిందని, చూస్తే ఇందులో మీ నెంబర్ ఉందని, అసలు ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకోవచ్చా అంటూ ఒక చిన్నారి సరదాగా అబద్ధం ఆడింది. రోడ్డుపై దొరికిన ఫోన్ నుంచి అలా మాట్లాడేసరికి ఆశ్చర్యపోయిన ప్రభాస్, వెంటనే ఎలాంటి మారుమాట్లాడకుండా కాల్ కట్ చేసేశారు. ప్రభాస్ సడన్‌గా కాల్ కట్ చేసేసరికి అక్కడున్న పిల్లలతో పాటు కేటీఆర్ ఒక్కసారిగా గట్టిగా నవ్వుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్ మళ్లీ ప్రభాస్‌కు ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు. తాము ఒక టాక్ షోలో ఉన్నామని, పిల్లలు సరదాగా ఈ ప్రాంక్ చేశారని వివరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలతో కలిసి తాను చేసిన ఈ సరదా ప్రాంక్ గురించి తెలుసుకుని ప్రభాస్ కూడా నవ్వుతూ సరదాగా ముచ్చటించారు. ప్రస్తుతం ఈ క్యూట్ అండ్ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతూ అందరినీ అలరిస్తోంది.
KTR and gang did a prank call to Prabhas 🤣🔥 pic.twitter.com/K3BBKFVjM9
— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) September 10, 2026