HomeHyderabad₹1108 Crore Sanctioned For Omkareshwar Temple Development
ఓంకారేశ్వర ఆలయానికి 1,108 కోట్లు
సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : మూసీ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 1,108 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతులను ఇచ్చింది. ఆలయ సముదాయ అభివృద్ధి, 100 అడుగుల రాజగోపురం, పుష్కరిణి, 207 అడుగుల మహా మండపం, గర్భాలయంతో పాటు, 100 ఫీట్ల వెడల్పుతో గ్రేహౌండ్స్ నుంచి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాంతాలను భారీ రహదారిని నిర్మించేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.
అదే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్లు, అంచనాలు, టెండర్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు టెక్నికల్ కమిటీని కూడా నియమించిన సర్కార్.. కమిటీకి చైర్మన్గా ఆర్ అండ్ బీ ఇంజినీరింగ్ చీఫ్, కో చైర్మన్గా పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ చీఫ్ వ్యవహరించనున్నారు.