Love And War | ఇండిపెండెన్స్ రోజున రణబీర్, ఆలియా ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్!
Love And War | ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ చిత్రం 'లవ్ అండ్ వార్' నుంచి అభిమానులకు భారీ అప్డేట్ వచ్చేసింది.
Love And War | ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ చిత్రం ‘లవ్ అండ్ వార్’ నుంచి అభిమానులకు భారీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. అత్యంత భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో కేవలం పోస్టర్లే కాకుండా, గ్రాండ్ విజువల్స్‌తో కూడిన ఒక మోషన్ పోస్టర్ లేదా అనౌన్స్మెంట్ వీడియోను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. విక్కీ కౌశల్ తన నటనకు సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసుకోగా, రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్లు రానున్న 20 రోజుల్లో తమ మిగిలిన షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ కెరీర్లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’ కథ ఇద్దరు బలమైన సైనిక అధికారులు (రణబీర్ కపూర్, విక్కీ కౌశల్) మరియు వారి మధ్య చిక్కుకునే ఆలియా భట్ పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం. 2007లో వచ్చిన ‘సావరియా’ తర్వాత భన్సాలీ, రణబీర్ కపూర్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇదే కావడం విశేషం. అలాగే ‘గంగూబాయి కఠియావాడి’ తర్వాత భన్సాలీ, ఆలియా భట్ మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ భారీ చిత్రం 2027 రిపబ్లిక్ డే కానుకగా జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

