గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ దమ్మపేట మండల కన్వీనర్ మురహరి రఘు అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఎంపీడీఓ రవీందర్ రెడ్డికి...
దమ్మపేట, ఆగస్టు 07 : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ దమ్మపేట మండల కన్వీనర్ మురహరి రఘు అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఎంపీడీఓ రవీందర్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తుందని విమర్శించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ నాయకులు విజయలక్ష్మి, యశోద, మల్లేశ్వరి, భవాని, నరసమ్మ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

