భువనగిరి హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో చోరీకి యత్నం
భువనగిరి పట్టణంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంలో చోరీకి పాల్పడేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చి ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించేందుకు...
– పోలీసుల అప్రమత్తతతో పరారైన దుండగుడు
భువనగిరి అర్బన్, ఆగస్టు 07 : భువనగిరి పట్టణంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంలో చోరీకి పాల్పడేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చి ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించేందుకు ప్రయత్నించాడు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న భువనగిరి పట్టణ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకోగా, పోలీసులను గమనించిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ ఎం.రమేశ్ తెలిపారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

